శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (14:35 IST)

తనూజతో దేవర నటుడి నిశ్చితార్థం

Devara actor announces engagement
Devara actor announces engagement
దసరా సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో నిశ్చితార్థం జరిగింది. అతను తన స్నేహితురాలు, ప్రముఖ మోడల్ తనూజతో నిశ్చితార్థం చేసుకున్నాడు. తనూజ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని పుకార్లు వచ్చాయి 
 
జనవరి 2న తనూజతో తన నిశ్చితార్థాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంగేజ్‌మెంట్ ఫోటో షూట్‌లో ఇద్దరూ చాలా హ్యాపీగా కనిపించారు. 
 
తనూజ లేత గులాబీ, తెలుపు దుస్తులలో మెరిసిపోయింది. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
 
 
మలయాళ చిత్ర పరిశ్రమలో షైన్ టామ్ చాకో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత 2011లో నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుసగా మలయాళ సినిమాల్లో నటించాడు. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేశాడు.
 
 
 
ఈ ఏడాది షైన్ టామ్ చాకో తెలుగు ఇండస్ట్రీలో నాని హీరోగా నటించిన దసరా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో విలన్ పాత్రలో సినీ ప్రియులను మెప్పించాడు. 
 
రీసెంట్‌గా జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే తమిళ సినిమాలోనూ కీలక పాత్ర పోషించాడు.
 
 షైన్ టామ్ చాకో ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.