మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 29 జులై 2017 (11:08 IST)

ప్రజలు ఏంకోరుకుంటారో అదేజరుగుతుంది.. రజనీ పొలిటకల్ ఎంట్రీపై ధనుష్ కామెంట్స్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఆయన అల్లుడు, తమిళ హీరో ధనుష్ తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రజలు ఏం కోరుకుంటారో అదేజరుగుతుందని మామ రజనీ రాజకీయాలపై చెప్పకనే చెప్పారు.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఆయన అల్లుడు, తమిళ హీరో ధనుష్ తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రజలు ఏం కోరుకుంటారో అదేజరుగుతుందని మామ రజనీ రాజకీయాలపై చెప్పకనే చెప్పారు.
 
ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ధనుష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అనేక విషయాలను పేర్కొన్నారు. ఇందులో అనేక విషయాలను ధనుష్ వెల్లడించారు. పదోతరగతి వరకూ చాలా టాలెంటెడ్ స్టూడెంట్‌ని అనీ, ఫస్ట్ క్లాసులో పాసయ్యేవాడినని చెబుతున్న ధనుష్.. ప్లస్ వన్‌కు వచ్చేసరికి ఫెయిల్యూర్ అయ్యానంటున్నాడు. దీనికి కారణం అమ్మాయిలతో తిరగడమేనని చెప్పారు. 
 
‘నా కంటే చాలా టాలెంట్ ఉన్నవాళ్లు, అందంగా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఈ స్థాయికి నేను వచ్చానంటే దేవుడి దయ, నా కృషి కారణం’ అని ధనుష్ స్పష్టం చేస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడు సిన్సియర్‌‌గా హార్డ్ వర్క్ చేయకపోతే ప్రయోజనం శూన్యమన్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు. 
 
‘ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయికి నేను ఇష్టం. ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం..’.. ఇదే తాను ఆలోచించాననీ, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అల్లుడిని అవుతున్నానని గర్వంగా ఫీల్ అవలేదని చెబుతున్నాడు. తనకు నచ్చితే ఏదైనా ఓపెన్‌గా ప్రశంసలు కురిపిస్తారని రజనీకాంత్ గురించి ధనుష్ చెబుతున్నాడు. ‘ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుంది’ అని రజనీ రాజకీయరంగ ప్రవేశం గురించి కుండబద్దలు కొట్టాడు.