బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది : పోలీసులకు పూరి జగన్నాథ్ ఫిర్యాదు

Puri Birthday celebrations
తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, అందువల్ల రక్షణ కల్పించాలని కోరుతూ ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా "లైగర్" చిత్రం సినిమా తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. 
 
భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. అయితే, ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీనివల్ల బయ్యర్లు, పంపణీదారులు భారీ నష్టాలను చవిచూశారు. తమకు డబ్బులు చెల్లించకపోతే ఇంటికి వచ్చి ధర్నా చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో ఒకటి ఇటీవల లీక్ అయింది. 
 
ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్‌లు తన కుటుంబంపై దాడి చేయడానికి ఇతరులను ప్రేరేపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించాలని కోరారు.