1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (11:25 IST)

ఏపీ సర్కారు తీపి కబురు- పోలీసు శాఖలో 6511 పోస్టుల భర్తీ

Jobs
ఏపీ రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా వున్న 6511 పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ పోస్టుల భర్తీని త్వరితగతిన చేపట్టాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. 
 
రాష్ట్ర పోలీసు శాఖలోని సివిల్ పోలీసింగ్, రిజర్వ్ పోలీసు శాఖల్లో ఉన్న 6,511 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. 
 
సివిల్ పోలీసింగ్‌లో 3,580 కానిస్టేబుల్ పోస్టులు, 315 ఎస్ఐ పోస్టులు భర్తీ కానున్నాయి. రిజర్వ్ పోలీసు విభాగంలో భాగంగా ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్ పోస్టులు, 96 ఎస్ఐ పోస్టులు భర్తీ కానున్నాయి.