గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (22:12 IST)

విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేస్తున్న వైకాపా నేతలు...

aluru sambasiva reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిధులను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా, సలహాదారుల పేరుతో అనేక మందిని నియమించుకున్న ఏపీ సర్కారు వారికి నెలకు లక్షల్లో వేతనాలను చెల్లిస్తుంది. 
 
తాజాగా ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులైన ఎమ్మెల్యే భర్త, బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన పేరు ఆలూరి సాంబశివరెడ్డి. ఈ నెల 17వ తేదీన ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులయ్యారు. విద్యా శాఖలో సలహాదారుడుగా జగన్ సర్కారు ఆయన్ను నియమించింది. ఆ మరుసటి రోజే ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీట్లో కూర్చున్న మరుసటి రోజే ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిపోయారు. 
 
ఏపీ ఉన్నత విద్యా సాఖ ప్రతినిధి బృందం జర్మనీ పర్యటనకు వెళ్లింది. ఈ బృందంలో సాంబశివారెడ్డి కూడా ఉన్నారు. జర్మనీ విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చల నిమిత్తం ఈ బృందం విదేశీ పర్యటనకు వెళ్లింది. విద్యకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరు వర్గాలు చర్చలు జరుపనున్నాయి. ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వ సలదారుగా సాంబశివారెడ్డి కీలక భూమిక పోషించనున్నారు. కాగా, ఈయన అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్తే కావడం గమనార్హం.