శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:43 IST)

ఉద్యోగ సంఘాలతో విడివిడిగా ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల చర్చలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌భుత్వ ఉద్యోగులు చేపట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విర‌మింప‌జేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. పి.ఆర్.సి. నివేదిక స‌కాలంలో విడుద‌ల చేయ‌లేద‌ని, మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌పై ఏపీ ఎన్జీవోలు నిర‌స‌న‌లు ప్రారంభించారు. దీనిని విర‌మింప‌జేయ‌డానికి ఎపీజెఎసీ అమరావతి నేతలతో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామ‌కృష్ణా రెడ్డి చర్చలు జ‌రిపారు. 
 
 
చ‌ర్చ‌ల అనంత‌రం ఎపీ జెఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ప‌ద‌కొండో పీఆర్సీ అంశాలు, సహా 70 డిమాండ్లు అమలుపై సజ్జలతో చర్చించామ‌ని, త‌మ డిమాండ్లను సీఎం వద్దకు తీసుకు వెళ్ళేందుకు సజ్జల చర్చలు జరిపార‌న్నారు. సీఎం జగన్ పై తాము చాలా నమ్మకంతో ఉన్నామ‌ని, సీఎస్ ఇచ్చిన ప్రతిపాదనలు త‌మ‌కు మేలు చేసే పీఆర్సీ కాద‌న్నారు. సీఎస్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి మేలు చేసేదే కాని, ఉద్యోగులకు మేలు చేసేది కాదని చెప్పామ‌ని, ప్రతిపాదనలు అమలు చేస్తే ఉద్యోగుల ఉనికికే ప్రశ్నార్థకమవుతుందని చెప్పామ‌న్నారు. ఉద్యోగులకు  55 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సజ్జలను కోరామ‌ని, హామీలు అమలయ్యే వరకు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశామ‌న్నారు.  
 
 
అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను యథాతథంగా అమలు చేయాలని కోరామ‌ని, సీఎం త‌మ‌ డిమాండ్లపై  సానుకూలంగా ఉన్నారని భావిస్తున్నామ‌న్నారు. నిరాశ నిస్పృహలోకి వెళ్లిన ఉద్యోగులకు సంతోషం కల్గించే వార్త సీఎం చెబుతారని ఆశిస్తున్నామ‌ని చెప్పారు. త‌మ‌కు 14.29శాతం  ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ చెప్పడం సరైంది కాద‌ని, 1-7-2018 నుంచి 55 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలన్నదే త‌మ డిమాండ్ అని, ఇక ఎంత ఫిట్ మెంట్ ఇస్తారనేది సీఎం ఇష్టం అన్నారు.
 
 
ఏపీ జెఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ, త‌మ‌ అభిప్రాయాలను, ఆవేదనను సజ్జలకు స్పష్టంగా  చెప్పామ‌న్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇచ్చిన సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామ‌న్నారు. కనీసం నివేదిక అంశాలను త‌మ‌తో సీఎస్ కమిటీ  చర్చించలేద‌ని, 
14.29 శాతం ఫిట్ మెంట్ చెప్పడాన్ని జెఎసీలు వ్యతిరేకించాయ‌న్నారు.