మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (20:31 IST)

నెలజీతం ఎలుకల పాలు.. రూ.26వేలను కొరికేశాయి..(video)

ఓ లారీ డ్రైవర్ నెలజీతం ఎలుకల పాలైంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన జమీర్ లారీ డ్రైవర్ తన నెల జీతాన్ని ఎలుకలకు పెట్టాడు. తనకున్న లారీని నడుపుకుంటూ మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి నిజామాబాద్ కు ఉల్లిగడ్డలు తీసుకువచ్చాడు. 
 
రూ.26 వేలకు లారీ అద్దెకు మాట్లాడుకున్నాడు ఉల్లిగడ్డలు నిజామాబాద్ లో అన్లోడ్ చేసేసరికి రాత్రి కావడంతో అద్దెడబ్బులు రూ.26వేలు లారీ క్యాబిల్లో పెట్టి నిద్రపోయాడు. 
 
ఉదయం లేచిచూసేసరికి నోట్లన్నీ ముక్కలై కనిపించాయి. కాయకష్టం చేసిన డబ్బులు ఎలుకల పాలు కావడంతో బాధితుడు జమీర్ ఆవేదన చెందారు. తన కష్టం అంతా ఎలుకల పాలైందని వాపోయాడు.