శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (14:18 IST)

గద్వాల్ జయ,TRSకి ఆ వీడియో చూపించండి.. కిల్లర్ డాగ్స్- ఆర్జీవీ

Ram Gopal Varma
నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు చంపిన హైదరాబాదు అంబర్‌పేట ఘటనపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. 
 
తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా రాసుకొచ్చారు.. ఆర్జీవీ. "హృదయాన్ని కదిలించే ఈ వీడియోను హైదరాబాద్ మేయర్ @గద్వాల్ జయTRSకి పదేపదే చూపించాల్సిన అవసరం ఉంది. ఆమెనే నిజమైన ప్యాక్ లీడర్ అని నేను చెబుతాను. కిల్లర్ డాగ్స్." అంటూ ఫైర్ అయ్యారు. 
 
"సార్ @KTRBRS దయచేసి మొత్తం 5 లక్షల కుక్కలను డాగ్ హోమ్‌గా మార్చండి. మేయర్ @గద్వాల్ విజయ TRSని వాటి మధ్యలో ఉండేలా చేయండి" అని ట్వీట్ చేశారు.
 
మరో ట్వీట్‌లో "కుక్కల బెడదను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కేటాయించిన 18 కోట్లు ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై టీవీలో చర్చకు సిద్ధమని ప్రకటించారు.