శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:11 IST)

పవన్‌ కళ్యాణ్‌, సాయితేజ్‌ కాంబినేషన్‌లో చిత్రం షూరూ

siatej, samudra khani, pawan
siatej, samudra khani, pawan
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం బుధవారంనాడు షూటింగ్‌ ప్రారంభమైంది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమిళ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఓ ఫంక్షన్‌లో సాయితేజ్‌ మాట్లాడుతూ, పవర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నాను. త్వరలో మంచి న్యూస్‌ వస్తుందని చెప్పాడు.
 
pawan-sai tej
pawan-sai tej
బుధవారంనాడు ప్రారంభమైన పూజ కార్యక్రమంలో సంగీత దర్శకుడు థమన్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. తాజాగా సాయితేజ్‌ విరూపాక్ష సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. గత ఏడాది బైక్‌ రోడ్డు యాక్సిండెట్‌ తర్వాత కొద్దిరోజులు ఆసుపత్రిలో వున్న సాయితేజ్‌ ప్రేక్షకులు, అభిమానుల ఆశీస్సులతో పూర్తి ఆరోగ్యంతో వున్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌తో అభిమానులు ఖుషీగా వున్నారు. అతి త్వరలో ఈ సినిమాపై మరిన్ని వివరాలు తెలియనున్నాయి.