సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మే 2020 (13:21 IST)

నేను బాలకృష్ణను హ్యాండిల్ చేయలేను.. చెప్పిందెవరంటే?

నందమూరి హీరో బాలకృష్ణను తాను హ్యాండిల్ చేయలేనని.. దర్శకుడు తేజ అన్నారు. ఇప్పటికే తేజ, బాలకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ తండ్రి సీనియర్ ఎన్.టి.ఆర్ నందమూరి తారకరామారావు జీవిత కథ తెరకెక్కాల్సింది. కానీ ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలకృష్ణ లాంటి హీరోతో భారీ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయలేకే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని తేజ వెల్లడించారు. ఆ తర్వాత ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
 
తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకోవడంపై రకరకాల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. బాలకృష్ణని తేజ హ్యాండిల్ చేయలేకపోయాడని.. అలాగే రామారావు బయోపిక్ అందులోను రెండు భాగాలు అంటే తేజ భయపడ్డాడని వార్తలొచ్చాయి. 
 
ఇక తేజ దర్శకుడన్న మాటేగాని బాలకృష్ణ డైరెక్ట్ చేస్తుండటం తేజ సహించలేకపోయాడట. రెండు భాగాలలో భారీ కాస్టింగ్ ఉండటంతో తేజ భారంగా ఫీలయ్యాడట. అందుకే ఈ బయోపిక్ నుండి తప్పుకున్నాడని తెలిసింది. ప్రస్తుతం అదే మాటను తేజ చెప్పేశాడు.