బిచ్చగాడికి ఐదు రూపాయలిస్తే ఏంచేస్తాడో తెలుసా- చిరంజీవి సంచలన వ్యాఖ్య
మెగాస్టార్ చిరంజీవి పబ్లిక్ ఫంక్షన్లో ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడుతుంటాడు. ఒక్కోసారి తను చెప్పాలనుకున్నవి సమయం చూసి మరీ చెబుతారు. ఆమధ్య `మా` ఎలక్షన్ సందర్భంగానూ అంతే జరిగింది. ప్రకాష్‌రాజ్ పేనల్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆఖరికి రిజల్ట్ మంచు విష్ణుకు అనుకూలంగా రావడంతో కాస్త లేట్‌గా చిరు స్పందిస్తూ, మా ఎన్నికల్లో అనవసరంగా నా పేరు బయటకు వచ్చింది. నేను ఎవరికీ సపోర్ట్ ఇవ్వలేదని అన్నారు.
ఇక తాజా పరిణామాలు చూస్తే, సినిమా థియేటర్లలో టిక్కెట్ రేట్ల విషయంలో ఆంధ్ర సి.ఎం. వైఎస్. జగన్ తీసుకోబోతున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు కూడా. పేర్ని నాని ఏకంగా చిరంజీవిని కలిసి చర్చలకు ఆహ్వానించారు. ఆ తర్వాత ఆన్‌లైన్ టిక్కెట్ల వ్యవహారం ప్రభుత్వమే తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. అయితే దానిపై పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు. కానీ చిరంజీవి ఇంతవరకు దానిపై స్పష్టత ఇవ్వలేదు.
కానీ ఇటీవలే హైదాబాద్‌లో నోవాటెల్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ రేట్లపై ఆయన ఇలా స్పందించారు.
- బిచ్చగాడికి ఐదు రూపాయలు వేస్తే! ఇంతేనా! అని మొహం వైపు చూస్తాడు. అలాగే థియేటర్లలో టికెట్ రేట్లు చాలా చోట్ల అతి తక్కువగా వున్నాయి. ఇలా వుంటే మాకు ఎలా వర్కవుట్ అవుతుంది. ఇక సినిమాలు ఎలా తీసుకోవాలి. కోట్లు ఖర్చు పెట్టి మేం సినిమాలు తీస్తున్నాం. అందుకే ఒకసారి ఆలోచించాలని ప్రభుత్వానుద్దేశించి పొలైట్‌గా మాట్లాడారు.
- అయితే సంక్రాంతికి అగ్రహీరోల సినిమాల టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం కూడా సానుకూలంగా వుంది. మరి చిరంజీవి వ్యాఖ్యలనుబట్టి ప్రభుత్వానికి టికెట్ రేటు పెంచే అధికారం లేదనేదిగా కొందరు భావిస్తున్నారు. అవార్డు ఫంక్షన్‌లో చిరు స్పీచ్ పూర్తి పాఠం బటయకు రాలేదు. కానీ బిచ్చగాడిని కంపేర్ చేస్తూ మాట్లాడింది మాత్రం నిజమని తెలిసింది.