ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (18:05 IST)

భూతద్ధం భాస్కర్‌ నారాయణ డప్పుకొట్టి చెప్పుకొనా అంటే ఎలావుంటుందో తెలుసా!

Siva Kandukuri, Rashi Singh
Siva Kandukuri, Rashi Singh
హీరో శివ కందుకూరి. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన సినిమాతో  ప్రేక్షకులను అలరించనున్నాడు. శివ కందుకూరి  హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా  "భూతద్ధం భాస్కర్‌ నారాయణ". ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు. 
 
ఇదివరకే రిలీజైన మోషన్ పోస్టర్ తో అంచనాలను పెంచింది ఈ చిత్రం. అలానే ఈ చిత్ర టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో శివ కందుకూరి డిటెక్టీవ్ గా కనిపించనున్నాడు. మంచి కథతో పాటు అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే బాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ ను ప్రెజెంట్ చేసారు మేకర్స్. 
 
తాజాగా ఈ చిత్రం నుండి "డప్పుకొట్టి చెప్పుకొనా" అనే సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్  సంగీతం అందించాడు.భాస్కర భట్ల రచించిన ఈ పాటను, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అందరికి అర్ధమయ్యే పదాలతో భాస్కర్ భట్ల ఈ పాటను అద్భుతంగా రచించారు. 
"అందాల ఓ వెన్నెల నువ్వు నా కళ్ళ ముందుండగా 
ఏనాడూ ఏ  చీకటి ఇక రాదంట నా వైపుగా" 
డప్పుకొట్టి చెప్పుకొనా 
ఊరంతా నేను డప్పుకొట్టి చెప్పుకొనా
గుప్పెడంత గుండెలోన ఆనందమంతా డప్పుకొట్టి చెప్పుకొనా"
లాంటి లిరిక్స్ ఖచ్చితంగా యూత్ ను ఆకట్టుకుంటాయి. 
 
ఇదివరకే ఈ చిత్రం గురించి మేకర్స్ ప్రస్తావిస్తూ ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి ఎడ్జ్‌ ఆఫ్‌ద సీట్‌గా వుంటుంది. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్ని ప్రేక్షకులు ముందుగా ఊహించడం చాలా కష్టం’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.