గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (14:28 IST)

ఆర్‌.ఎక్స్‌.100 చూడొద్ద‌న్నా -నా ఫిజిక్ చూసి ప‌డిపోయారుః కార్తికేయ‌

Kartikeya- Lohita
'ఆర్ఎక్స్ 100 క‌థ‌నాయ‌కుడు కార్తికేయ‌. ఆ సినిమాను యూత్ అంతా చూశారు. దాంతో కార్తికేయ‌కు తొలి స‌క్సెస్ వచ్చింది. ఆ సినిమాపై విమ‌ర్శ‌లు ర‌క‌ర‌కాలుగా వాఖ్యానించారు. అయినా అవేవీ ప‌ట్టించుకోలేదు ఆ క‌థానాయ‌కుడు .అలాంటి కార్తికేయను లోహిత అనే అమ్మాయి ప్రేమించింది. ఈ ప్రేమ వ్య‌వ‌హారం గురించి కార్తికేయ ఏమంటున్నారో చూద్దాం.
 
నేను కాలేజీ చ‌దివేట‌ప్పుడే డాన్స్ చేసేవాడిని. కొన్ని కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనేవాడిని. అప్పుడే లోహిత ప‌రిచ‌యం. కాలేజీ మంచి పేరు వుంది. అది ప్రేమ‌గా మారింది. ఆ త‌ర్వాత మా ఇంటిలో తెలిస్తే ఒప్పుకోలేదు. వాళింట్లో కూడా అంగీక‌రించ‌లేదు. సినిమావాడు సెటిల్ కావ‌డం క‌ష్టం అనే ఆలోచ‌న‌లో వున్నారు. కొన్నాళ్ళ‌కు నేను హీరోగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాను. 'ఆర్ఎక్స్ 100  సినిమా వ‌చ్చింది. చేశాను. గొప్ప స‌క్సెస్ అయింది. కానీ ఆ సినిమాను లోహిత కానీ వారి ఇంటిలోవారు చూడలేదు. సినిమాలంటే ఇష్టం వుండ‌దు వాళ్ళ‌కు.
 
Kartikeya- Lohita
ఆ త‌ర్వాత సినిమాలు చేసుకుంటూ పోతున్నా. పెద్ద స‌క్సెస్‌లేదు. ఏవ‌రేజ్‌గా న‌డిచిపోతుంది. అలాంటి స‌మ‌యంలో గ్యాంగ్ లీడర్‌ సినిమాకు  దర్శకుడు విక్రమ్ కె. కుమార్ విల‌న్‌గా అడిగారు. ఇప్పుడు అజిత్ సినిమాకూ ఆ చిత్ర‌ ద‌ర్శ‌కుడు న‌న్నే ఎంచుకున్నారు. న‌న్నే ఎందుకు అనే డౌట్ వ‌చ్చింది. అదే వారికి చెబితే నీ బాడీ చూసి ఎంపిక‌చేశామ‌న్నారు. ఇదే విష‌యాన్ని మొద‌ట్లో ఆర్‌.ఎక్స్‌. 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ బూప‌తి కూడా ఇదే చెప్పారు. నేను కాలేజీలో వుండ‌గా నా బాడీని చూసి అంద‌రూ మెచ్చుకునేవారు. సో. అదే నాకు అవ‌కాశాలు, ప్రేమ‌ను ద‌క్కేలా చేసింద‌ని వివ‌రించారు. 
 
అయితే లోహిత‌కు నేను రాజావిక్ర‌మా ప్రీరిలీజ్‌లో ప్ర‌పోజ్ చేస్తున్న‌ట్లు ముందుగా చెప్ప‌లేదు. జీవితంలో గుర్తిండిపోయేలా వుండాల‌ని ష‌డెన్‌గా అలా స్టేజీమీద చెప్పాను. ఇప్పుడు మా ప్రేమ‌ను వాళింటిలో కూడా అంగీక‌రించారు. కానీ వారు ఇప్ప‌టివ‌ర‌కు ఆర్‌.ఎక్స్‌.100 సినిమా చూడ‌లేదు. నేను చూడొద్దు అన్నా. ఒక‌వేళ చూపిస్తే లోహిత‌కు.. సెకండాఫ్ నుంచి చూపిస్తా.. అంటూ కార్తికేయ వెల్ల‌డించారు.