శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (10:26 IST)

#DorasaaniTeaser నేను చిన్న దొరసాన్ని ప్రేమిస్తానురా... (Video)

యాంగ్రీ మన్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కీలక పాత్రలో నటిస్తున్న దొరసాని సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. ఈ లుక్‌కు ప్రేక్షకుల మధ్య మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
ఈ లుక్‌లో శివాత్మిక కారులో ప్రయాణిస్తుండగా.. సైకిల్‌పై ఆనంద్‌ ఆమెను ఫాలో అవుతూ కనిపించారు. లుక్‌ను చూస్తే సినిమాను 1980ల కాలం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రముఖ షార్ట్‌ ఫలింమేకర్‌ కేవీఆర్‌ మహేంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 
పాతకాలంనాటి టీనేజ్‌ రొమాన్స్‌ను, ఆ కాలంలో ఇద్దరు ప్రేమికులు సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో చూపించబోతున్నారు.  యశ్‌ రంగినేని, మధురా శ్రీధర్‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. తాజాగా 'దొరసాని' టీజర్ గురువారం విడుదలై, వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.