ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (17:45 IST)

ఆఫ్రికా అడవుల్లో చెర్రీ - ఉప్సీ ప్రీ-వెడ్డింగ్ యానివర్సరీ ట్రిప్

టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఆఫ్రికా అడవుల్లో విహరిస్తున్నారు. నిన్నటికి నిన్న రెండు పులి పిల్లలతో ఆడుకుంటూ కనిపించిన ఉపానసన... ఇపుడు తన భర్త చెర్రీతో కలిసి ఆఫ్రికా అడవుల్లో జీపులో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చెర్రీ - ఉప్సీలు తమ ప్రీ వెడ్డింగ్ యానివర్శరీ ట్రిప్‌ను ఆఫ్రికాలో ఎంజాయ్ చేశారు. వారిద్దరికి వివాహమై ఈ నెల 14వ తేదీతో ఏడేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికాలోని టాంజానియాలో జరిపిన స్పెషల్ ట్రిప్ సందర్భంగా అక్కడి… వన్ నేచర్ న్యారుస్ విగ లగ్జరీ సఫారీ పార్క్ లోను, నెరెంగిటీ నేషనల్ పార్కులోను తమ జంగిల్ సఫారీ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 
 
నెరెంగిటీ పార్కులో సింహం పిల్లలు గడ్డిలో సేదదీరుతుండగా తాము అతి దగ్గరలోనే డేర్ డెవిల్ సెల్ఫీ తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. అదొక మరపురాని అనుభూతి, అనుభవమని, ఈ ట్రిప్‌ని జీవితంలో మరచిపోలేమని ఉపాసన అన్నారు. ప్రతి వెడ్డింగ్ యానివర్సరీకి ఏదో ఓ కొత్త అడ్వెంచర్ చేయాలన్నది తమ కోర్కె అని, ఈ సారి తమ ప్రీ-యానివర్సరీ ఆఫ్రికాలో జరుపుకోవడం థ్రిల్లింగ్‌గా ఉందని ఉపాసన కామినేని కామెంట్స్ చేసింది.