శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 12 సెప్టెంబరు 2020 (15:45 IST)

డ్రగ్స్ కేసు: రకుల్ ప్రీత్ సింగ్ పేరును రియా చక్రవర్తి చెప్పిందా? నిజంగా లింకు వుందా?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సాగుతుండగానే అందులో డ్రగ్స్ వ్యవహారం కూడా వున్నట్లు తేలడంతో రియాను అరెస్టు చేశారు. డ్రగ్స్ దందాపై ఆమెను అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో రియా చక్రవర్తి మొత్తం 25 మంది సినీ ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్లు సమాచారం.
 
ఇందులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వుందంటూ ప్రచారం జరుగుతోంది. రకుల్, సారా అలీఖాన్లతో కలిసి నేను డ్రగ్స్ సేవించేదాన్నంటూ రియా చక్రవర్తి చెప్పిందంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే ఈ వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించలేదు.
మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి సంబంధం వుండదనీ, ఆమె సైనిక కుటుంబం నుంచి వచ్చిందనీ, పైగా వ్యాయామశాలలో ప్రతిరోజూ వేకువజామునే లేచి వ్యాయామం చేస్తూ వుంటారనీ, అలాంటివారు డ్రగ్స్ తీసుకునే అవకాశమే లేదని అంటున్నారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ అంటే కిట్టనివారు మాత్రం ఆమెపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరి రకుల్ ప్రీత్ సింగ్ పేరును రియా చక్రవర్తి నిజంగా చెప్పిందా.. ఇదంతా అభూతకల్పనా అనేది తెలియాల్సి వుంది.