నేటి తరానికి సాంప్రదాయ సంగీతాన్ని అందించే ఎపిక్టైజ్ మీడియా హౌస్
Hari Damera, Nagraju Thalluri, C Kalyan, Maruti, VN Aditya
భారతీయతకు బలమైన పునాది మన సంస్కృతి, సంప్రదాయాలు. వాటిని కాపాడుకుంటూ నవ్యతను జోడించుకుంటూ మన సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఆకాంక్షతో మీడియా హౌస్ మొదలు పెట్టారు. అదే 'ఎపిక్టైజ్స. మీడియా హౌస్ తో పాటు వెబ్ సైట్ కూడా ప్రారంభం అయింది. హరి దామెర, నాగరాజు తాళ్లూరి ఇద్దరు కలిసి మొదలు పెట్టిన అద్భుత కార్యక్రమం 'ఎపిక్టైజ్' మీడియా. ఈ మీడియా లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు మారుతి, దర్శకుడు వి ఎన్ ఆదిత్య, రాజ్ మాదిరాజు తదితరులు పాల్గొన్నారు. 'ఎపిక్టైజ్ మీడియా సంస్థ' తన తొలి కార్యక్రమంగా 'రాగరస... రీగరీసా' అనే కార్యక్రమాన్ని నిర్విహిస్తోంది. శ్రీమతి మణి నాగరాజు దీనిని రూపకల్పన చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య, త్యాగరాజు, పురందర దాసు, మీరా భజన్స్, మొదలైన కీర్తనలకు ఆధునిక వాద్యపరికరాలతో సప్తస్వరాలను జోడించి సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ.. తర్వాతి తరాలకు అందించే బాధ్యతలో రూపుదిద్దుకన్న ప్రోగ్రామే ఈ 'రాగరస'... దేశంలో సంగీత సామ్రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గడించిన విద్యాంసులను, గానాలాపనచేసే ప్రావీణ్యులను ఓ వేదికపైకి తెచ్చే కార్యక్రమమే 'రాగరస' !!
ఈ సందర్బంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ .. నాగరాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు సంగీతకారులతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటినుండి వాళ్ళతోనే ఎక్కువగా ట్రావెల్ చేశాను. అలా చాలా ఎళ్ళ కిందటే నాగరాజు పరిచయం. తాను మంచి ఫ్లూట్ విద్వాంసుడు అన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసాడు. అయన ఫ్లూట్ వాయిస్తే ఎంత హాయిగా ఉంటుందో అందరికి తెలుసు. ఇప్పుడు చూశాం కూడా. నాగరాజు , హరి ఇద్దరు మిత్రులు కలిసి మన సాంప్రదాయ సంగీతాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ 'ఎపిక్టైజ్' మీడియా ను మొదలుపెట్టి నందుకు వారిని అభినందిస్తున్నాను. మన సంగీతం అంటే ప్రపంచం అంత ఆసక్తిగా వింటుంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో సంగీతం ఉంది. ఈ ఇద్దరు మిత్రులు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ .. నాగరాజు గారు నాకు బాగా తెలుసు. అయన మ్యూజిక్ నేను విన్నాను. నాగరాజు, హరి ఇద్దరు కలిసి ఓ గొప్ప ప్రయత్నానికి ప్రారంభం చేసారు. నిజంగా నేటి జనరేషన్ కు ఇలాంటి మ్యూజిక్ కావాలి. వీరిద్దరూ చేస్తున్న ప్రయత్నం మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. నాగరాజు, హరి నాకు బాగా తెలుసు. నాగరాజు ఫ్లూటిస్ట్ గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అయన తన శిష్యుడు అనాలా, లేక ఫ్రెండ్ అనాలా తెలియదు హరి తో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మంచి విజయం సాదించాలి అన్నారు. మరో దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాతుడు. హరి, నాగరాజు ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. వారిద్దరూ కలిసి చేస్తున్న మంచి ప్రయత్నం ఇది అన్నారు.