శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (17:42 IST)

అందాల ఆరబోత‌తో రెచ్చిపోతున్న స‌మంత‌

Samantha Prabhu
Samantha Prabhu
ఇటీవ‌ల స‌మంత ప్ర‌భు త‌న సోష‌ల్‌మీడియాలో వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను, వ‌స్త్రధార‌ణ‌ను నెటిజ‌న్ల‌కు తెలియ‌జేస్తూ తెగ ముచ్చ‌ట‌ప‌డిపోతుంది. సినిమాల‌తోపాటు వాణిజ్య‌ప్ర‌క‌ట‌ల‌ను కూడా ఆమె చేస్తోంది. ఇప్పుడు చాలా బిజీగా మారిన ఆమె త‌న ఆదాయ‌న్ని పెంచుకున్న‌ట్లే త‌న అందాల‌ను ఆర‌బోసే ప‌నిలోనూ వుంది. పెళ్ల‌యిన‌ప్పుడు తెలంగాణ చేనేత వ‌స్ట్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఆ త‌ర్వాత ప‌లు యాడ్‌ల‌ను చేసింది. ఈమ‌ధ్య ఓ హాలీవుడ్ సినిమాలో న‌టించ‌నున్న‌ద‌ని వార్త‌లు రావ‌డంతో అందుకు త‌గిన‌విధంగా బ్రాండ్‌ల‌ను ఎన్నుకుంటోంది.
 
తాజాగా ఇంట‌ర్‌నేష‌న్ బర్బెర్రీ దుస్తులకు మ‌రియు యాక్సెస‌రీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారింది. దాంతో స‌మంత రూటు మార్చేసింది. ఆ దుస్తులు ధ‌రించి ఇలా యూత్‌ను ఆక‌ట్టుకునే ఫోజులిచ్చింది. బికినీ టాప్‌తో ఇలా ఫోజులిచ్చింది. ఆమె లుక్ టోన్ట్‌బాడీ యూత్‌ను క‌వ్విస్తుంది. ముఖ్యంగా నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్‌లు చేస్తున్నారు. దీనికోస‌మేనా విడాకులు ఇచ్చిందంటూ కొంద‌రు కొంటె సెటైర్లు వేస్తున్నారు. య‌శోద‌, శాకులంతం వంటి చిత్రాలేకాదు ఇలా కూడా చేస్తానంటూ హిట్ ఇస్తోంది.