48 గంటల్లో నరకం అనుభవించా: కృతి కర్బందా

kriti kharbanda
ఐవీఆర్| Last Modified మంగళవారం, 4 మే 2021 (14:45 IST)
జీవితం ఎంతో విలువైనది. దాన్ని ఎంతమాత్రం లైట్ తీసుకోవద్దండీ, ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. కరోనా సోకినవారు నరకం అనుభవిస్తున్నారు. ఇల్లు దాటి బయటకు రావద్దండీ, మాస్కు లేకుండా ఎటూ వెళ్లొద్దండీ, కరోనా సోకిన రోగులకు బెడ్స్ లేక ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో లేక ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో చెప్పలేను.

గత 48 గంటల్లో నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం అని తన బాధను ట్విట్టర్ ద్వారా తెలియజేసింది బాలీవుడ్ నటి కృతి కర్బంద. ఐతే ఆమె ఎందుకు బాధపడిందన్నది తెలియజేయలేదు కానీ ఆమె చెప్పినదాన్ని బట్టి ఇంట్లో ఎవరో కరోనా బారిన పడ్డారని అర్థమవుతుంది.దీనిపై మరింత చదవండి :