బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మే 2023 (21:30 IST)

నవంబరులో అజిత్ కుమార్ బైక్ వరల్డ్ టూర్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ యూరోపా దేశాలకు సాహసోపేత బైక్ యాత్రను ప్రారంభించనున్నారు. అజిత్ తదుపరి చిత్రం "విడా ముయర్చి" తెరకెక్కుతోంది. 
 
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించబడనప్పటికీ, ఈ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
 
ఈ నేపథ్యంలో అజిత్ నవంబరులో ప్రపంచ పర్యటన చేపడతారని తెలుస్తోంది. ఈ వార్త అజిత్ అభిమానుల్లో ఉత్సాహపరిచింది. 
 
గత సంవత్సరం, అజిత్ ఐరోపాకు వెళ్లడానికి "తునివు" షూటింగ్ షెడ్యూల్ నుండి విరామం తీసుకున్నాడు. ఈసారి నేపాల్-భూటాన్ నుండి అజిత్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.