ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (21:03 IST)

ప్రియా వారియర్ ఎగిరి ప‌డిందిలా!

Priya varrier jumbing
`చెక్‌` సినిమా క‌థానాయిక  ప్రియావారియర్ షూటింగ్‌లో కింద ప‌డిపోయింది. అదేదో యాక్ష‌న్ సీన్ చేస్తుంటే ప‌డింద‌నుకుంటే పొర‌పాటు. త‌ను చ‌క్క‌గా హీరో నితిన్‌తో సాంగ్ వేసుకునే సంద‌ర్భంలో జ‌రిగిన సంఘ‌టన‌. ఓ పాత భ‌వంతి ద‌గ్గ‌ర నితిన్‌ను ఆట‌ప‌ట్టిస్తూ వుంటుంది. ష‌డెన్‌గా నితిన్ త‌ప్పించుకుంటూ ముందుకు ప‌రుగెడ‌తాడు. వెంట‌నే ఆమె వెనుక ప‌రుగెడుతూ నితిన్ భుజాల‌పై జంప్ చేసి ఎక్కాలి. అలా ప‌రుగెడుతూ వ‌చ్చి నితిన్ భుజాల‌పై ఎక్కే క్ర‌మంలో నితిన్ ను భుజాల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకుని ఎక్కాలి. కానీ ష‌డెన్‌గా నితిన్ భుజాల‌కు బ‌దులు ఆయ‌న వేసుకున్న జ‌ర్కిన్‌ను ప‌ట్టుకుంది. దాంతో ప‌ట్టుత‌ప్పి వెల్ల‌కిలా ప‌డింది. ప‌డే స‌మ‌యంలో త‌ల‌కు దెబ్బ‌త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌గా ప‌డిన‌ట్లు వీడియో క‌నిపిస్తుంది. ఇక వెంట‌నే అక్క‌డ వున్న ప్రియా అసిస్టెంట్లు, కొరియోగ్రాఫ‌ర్ టీమ్ వ‌చ్చి ఆమెను లేపారు. నితిన్ కూడా లేప‌డానికి స‌హ‌క‌రించారు. ఈ హ‌ఠాత్ ప‌రిణామానికి ప్రియా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ, ఓ వీడియోను పోస్ట్ చేసింది. షూటింగ్‌లో ఇలాంటివి జ‌ర‌గ‌డం మామూలే అంటూ ట్వీట్ చేసింది. చెక్ సినిమా ఈ శుక్ర‌వార‌మే విడుద‌ల‌వుతుంది. ఇందులో ర‌కుల్ ప్రీత్‌సింగ్ కూడా న‌టించింది.