శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (19:17 IST)

అప్పుడు ఐఫోన్ లిచ్చారు. `చెక్‌`కు పెద్దగిఫ్ట్ అడగాలిః సంపత్ రాజ్

Sampath Raj
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని నటుడు సంపత్ రాజ్‌. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తోప్రత్యేక అనుబంధం ఉంది. ఆయ‌న‌ ప్రారంభంలో 'లౌక్యం'లో అతడికి మంచిపాత్ర ఇచ్చి భవ్య క్రియేషన్స్ ప్రోత్సహించింది. ఈ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం'చెక్స‌. నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం 'చెక్'. శుక్రవారం (ఫిబ్రవరి 26న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సంపత్ రాజ్తో ఇంటర్వ్యూ.
 
'చెక్స‌ ఎలా ఉండబోతుంది?
మంచి కథతో రూపొందిన చిత్రమిది. జైలులో ఓ ఘటన జరిగిన తర్వాత ఏమైందనేదిచాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కువ శాతం హీరో ఒకే కాస్ట్యూమ్ లో కనిపిస్తారు. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉంటుందీ సినిమా.‌ చాలా బావుంటుంది.
 
మీరు నటించిన సినిమాల్లో 'చెక్' భిన్నమైన సినిమా అనుకోవచ్చా?
తెలుగులో నేను నటించిన సినిమాల్లో భిన్నమైనది ఇదే. సినిమాలో ఎక్కువలోకేషన్స్ ఉండవు. ఎక్కువ సన్నివేశాలు జైలులో జరుగుతాయి. షూటింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నిజ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటాడు? జైలుజీవితం ఎలా ఉంటుంది? అనేది చూశా. పదేళ్లు, ఇరవై ఏళ్ళు జైలులో అలా ఉండాలంటేఎలా ఉంటుంది? ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని చూశా. అది కాకుండాదర్శకుడు ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకువెళతారు. అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా. నాకునమ్మకం ఉంది.
 
మీరు పోలీస్ గా చేశారని తెలుస్తుంది. నితిన్ 'భీష్మ స‌లో కూడా పోలీస్ గా చేశారు కదా!
'భీష్మ'లో నేను పోలీస్ అయినప్పటికీ... అందులో నా క్యారెక్టర్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది. దానికి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి అసలు సంబంధం ఉండదు. రెండు డిఫరెంట్ రోల్స్. పోలిక ఏమీ ఉండదు.
 
'చెక్'లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
హీరో మీద పగ ఉంటుంది. ప్రతీకారంతో హీరోకి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరి అమలుకావాల్సిందే అనే లక్ష్యంతో ఉంటాడు. అతని జీవితంలో మరో అంశం  ఉరి పడిందా? లేదా? అన్నది సినిమా. చంద్రశేఖర్ యేలేటి గారు కథ చెప్పినప్పుడు విజువల్ గా ఆపాత్రలో నన్ను ఊహించుకున్నా. నాకు డిఫరెంట్ రోల్, డిఫరెంట్ పోలీస్ అని అర్థమైంది.
 
పోలీస్ అంటే సంప‌త్ అన్నట్టుగా వుందే?
(నవ్వుతూ) ఇప్పుడు 'ఎఫ్3'లో కూడా పోలీస్ గా చేస్తున్నాను. నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఓ లెటర్ రాస్తాను. 'నాకుపెన్షన్ ఇవ్వండి' అని. ఎక్కువసార్లు పోలీస్ గా నటిస్తున్నాను కదా! అలాగే, 'పోలీస్కమీషనర్, ఐజీ డ్రస్ లు నేనే కుట్టించుకుంటా' అని. పోలీస్ క్యారెక్టర్ అంటే దానికి తగ్గడ్రస్ నేనే వేసుకుని షూటింగ్ కి వెళ్తా. పెన్షన్ మాత్రం తప్పకుండా అడుగుతా. (నవ్వులు)
 
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గారి గురించి?
ఆయన గురించి చెక్ చేయడానికి ముందే నేను విన్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో వేరేసినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా కథ చెప్పడానికి ఆయన వచ్చారు. పదినిమిషాలు నా క్యారెక్టర్ గురించి వివరించారు. ఈలోపు మేం ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలుకాకుండా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం. దర్శకుడిగా ఆయన ప్రతిభగురించి అందరికీ తెలుసు.
 
భవ్య క్రియేషన్స్, సంపత్ రాజ్ స‌క్సెస్‌ ఫుల్ కాంబినేషన్ అనుకోవ‌చ్చా?
మా కాంబినేషన్ లో 'లౌక్యం' సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్అవ్వాలి. ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవి గారు నా ఫ్యామిలీ. భవ్య క్రియేషన్స్ మాతృసంస్థ‌ కింద భావిస్తా. ‘లౌక్యం’ హిట్ తర్వాత సక్సెస్ టూర్ లో కోన వెంకట్ గారు ఓ మాటచెప్పారు. సినిమా సక్సెస్ తర్వాత కనీసం ఒక యాపిల్ కూడా ఇవ్వరు. కానీ, ఆనందప్రసాద్ గారు యాపిల్ ఐ ఫోన్ ఇచ్చారు అని. కచ్చితంగా ఈ సినిమా ‘లౌక్యం’ కంటే పెద్దహిట్ అవుతుంది. ఐ ఫోన్ కంటే పెద్ద గిఫ్ట్ అడగాలి.