శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (15:53 IST)

జెమిని పెళ్ళి చేసుకోవద్దని సావిత్రిని ప్రాధేయపడిన ఎన్టీఆర్ - ఏఎన్నారు...

అప్పటికే వివాహమైన ఉన్న తమిళ హీరో జెమిని గణేశన్‌ను పెళ్లి చేసుకోవద్దని మహానటి సావిత్రికి దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఎంతగానో ప్రాధేయపడ్డారనీ, కానీ ఆమె తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాని సీనియర్

అప్పటికే వివాహమైన ఉన్న తమిళ హీరో జెమిని గణేశన్‌ను పెళ్లి చేసుకోవద్దని మహానటి సావిత్రికి దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఎంతగానో ప్రాధేయపడ్డారనీ, కానీ ఆమె తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాని సీనియర్ విలేఖరి గుడిపూడి శ్రీవరి చెప్పుకొచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన తాజాగా మాట్లాడుతూ, జెమినీ గణేశన్‌ను పెళ్లి చేసుకోవద్దని ఎన్టీఆర్.. ఏఎన్నార్ ఇద్దరూ ఎంతగానో చెప్పారు. ఈ ఇద్దరితోనూ ఆమె ఎన్నో సినిమాలు చేయడం వల్ల మంచి సాన్నిహిత్యం ఉండేది. అందువలన ఇద్దరూ కూడా సావిత్రి మంచిని కోరుకునే ఆమెను వారించారు. అయినా ఆమె వినిపించుకోకుండా.. జెమినీ గణేశన్‌ను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది.. మొదటి నుంచి కూడా ఆమెలో కొంత మొండితనం ఉండేదనీ అలా ఆమె తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుందని చెప్పింది. 
 
అంతేకాకుండా, చిత్రపరిశ్రమలో స్టార్ స్టేటస్‌కి చేరుకున్నవారికి.. ముందునుంచి కొంతమంది సపోర్ట్‌గా వుంటూ వచ్చేవాళ్లు. ఆ స్టార్స్ వెలుగు తగ్గాక .. అప్పటివరకూ వాళ్లను సపోర్ట్ చేస్తూవచ్చిన వాళ్ల నిజస్వరూపం బయటపడేది. చాలామంది విషయంలో ఇది జరిగింది .. సావిత్రి విషయంలోనూ అదే జరిగిందని వివరించారు.