సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (12:17 IST)

స్ట్రీట్ లైట్ లో జరిగే సంఘటనలతో రెండు భాష‌ల్లో సినిమా

Street Light
తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ,క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి క్రిమినల్ ఆలోచ‌న‌లు, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి అన్న నేపథ్యంలో ఈ సినిమా తీశాం. చీకట్లో జరిగే ముక్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం ‘రివెంజ్ డ్రామా’ ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా తీర్చి దిద్దాము. 
 
తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీసాం. దర్శకుడు విశ్వ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. గతంలో మేము విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్ తో పాటు టీజర్ ను ఆదరించి నందుకు ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. మూవీ మ్యాక్స్ అనే సంస్థ మాకున్నా, ఓటిటి వారు  ఎంతో మంది మాకు పరిచయం ఉండడంతో ముందుగా మా సినిమాను ఓటిటి లో విడుదల చేద్దాం అనుకున్నాము. కానీ ఓ.టి.టి వలన కొద్దిమందికి మాత్రమే జీవనోపాధి కలుగుతుంది. అదే ఒక థియేటర్ వలన ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుందనే ఆలోచనతో  ప్రస్తుత పరిస్థితుల దృష్టి లో ఉంచుకొని అందరూ కూడా తమ సినిమాలను థియేటర్స్ లలోనే విడుదల చేయాలని అందరికీ సవినయంగా తెలియ జేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా హిందీ  సెన్సార్ పూర్తి చేసుకొని తెలుగు సెన్సార్ కు వెళ్లబోతుంది.మా చిత్రాన్ని సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో  మా సినిమాను థియేటర్స్ లొనే విడుదల చేస్తున్నాము.  సినిమా బాగా వచ్చింది. "స్ట్రీట్ లైట్" సినిమా   థియేటర్స్ లలో విడుదల అయిన తరువాత ఓటిటి లో విడుదల చేస్తాము. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.