ఫిలింఫేర్ అవార్డులు... ఉత్తమ నటుడుగా రామ్ చరణ్
సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఒకటి ఫిల్మ్ ఫేర్ అవార్డులు. 2018 సంవత్సరానికిగాను ఈ అవార్డులను ప్రకటించగా, వీటి ప్రదానోత్సవం శనివారం రాత్రి చెన్నైలో జరిగింది. ఇందులో పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని ఎంపికైన వారికి అవార్డులు అందజేశారు.
2018 సంవత్సరానికిగాను ఉత్తమ నటుడుగా రంగస్థలం చిత్రంలో చిట్టిబాబుగా ప్రేక్షకులను ఆలరించిన హీరో రామ్ చరణ్ ఎంపిక కాగా, ఉత్తమ చిత్రంగా మహానటి చిత్రాన్ని ఎంపిక చేశారు. కాగా, 2018 ఫిలింఫేర్ అవార్డ్స్(తెలుగు)లు గెలుచుకున్న వివరాలను పరిశీలిస్తే,
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ నటుడు: రామ్‌చరణ్(రంగస్థలం)
ఉత్తమ నటి: కీర్తి సురేష్(మహానటి)
ఉత్తమ నటి(విమర్శకులు): రష్మిక(గీత గోవిందం)
ఉత్తమ నటుడు(విమర్శకులు): దుల్కర్ సల్మాన్(మహానటి)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్(మహానటి)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ సహాయనటుడు: జగపతిబాబు(అరవింద సమేత)
ఉత్తమ సహాయ నటి: అనసూయ(రంగస్థలం)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్(ఎంత సక్కగున్నవే..రంగస్థలం)
ఉత్తమ గాయకుడు: సిద్ శ్రీరామ్(ఇంకేం ఇంకేం కావాలె.. గీత గోవిందం)
ఉత్తమ గాయని: శ‌్రేయా ఘోషల్(మందార మందా.. భాగమతి)