మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (13:35 IST)

ఐదు భాష‌లు, ఐదుగురు గాయ‌కులు, ఐదురోజుల్లో ఆర్‌.ఆర్‌.ఆర్‌. దోస్తీ సాంగ్

Keeravani team
5 భాషలు, 5గురు ప్రముఖ గాయకులు. 5రోజుల్లో ఆర్‌.ఆర్‌.ఆర్‌. మూవీలోని థీమ్ సాంగ్ రావ‌డం కోసం చేతులు క‌లిపారు. ఈరోజు 11గంట‌ల‌కు వారంతా కీర‌వాణి సార‌థ్యంలో కూర్చుని థీమ్‌సాంగ్‌ను ఆల‌రించారు. ఇది ఆర్‌.ఆర్‌.ఆర్‌.లోని తొలి పాట‌. దీనిని పూర్తిచేసి నేటితో స‌రిగ్గా 5రోజుల‌కు అన‌గా ఆగ‌స్టు 1వ‌తేదీ 11గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.
 
పాన్ ఇండియా సినిమాకు స్వరాలు కూర్చ‌డానికి పాట‌ను పాడటానికి, మ్యూజిక్ వీడియోను షూట్ చేయడానికి వారంతా ఏక‌మ‌య్యారు. ఇక ఎస్.ఎస్.రాజమౌలి పీరియాడిక్ యాక్షన్ మూవీ “ఆర్ఆర్ఆర్” పూర్తయ్యే దశలో ఉంది. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత కథ “ఆర్ఆర్ఆర్”. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టిఆర్ కనిపించబోతున్నారు. 
 
మంగ‌ళ‌వారంనాడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుద‌ల‌చేయ‌డానికి ముహూర్తాన్ని పెట్టి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర‌యూనిట్. ``దోస్తీ` పేరుతో రూపొందుతున్న ఈ సాంగ్ కు తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించగా, కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర ఆలపించారు. మిగతా నాలుగు భాషల్లో అనుదీప్‌, అమిత్‌ త్రివేది, విజయ్‌ ఏసుదాసు, నజీర్‌ ఈ సాంగ్ ను పాడారు. ఆ సాంగ్ ఎలా వుంటుందో 5రోజుల‌కు తెలిసిపోతుంది.