బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (13:45 IST)

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

viveka - cib
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుల్లో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఒకరు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ బెయిల్‌‍ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కేసు విచారణ  పూర్తయిందని కోర్టుకు తెలిపింది. ఒక వేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టుకు తెలిపింది. 
 
అలాగే, వివేకా కుమార్తె సునీత తరపున సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం పాస్ ఓవర్ చేసింది. ఆ తర్వాత వాదనలు వినిపించేందుకు సిద్ధమని సునీత తరపు న్యాయవాది లూథ్రా ధర్మాసనానికి విన్నవించారు. భోజనం విరామం తర్వాత బెంచ్ కొనసాదడం లేదని, అందువల్ల మరోరోజు విచారణ చేపడుతామని జస్టిస్ సుందరేశ్ తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.