శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (18:57 IST)

లక్స్ పాపకు నరకం చూపించాడు.. ప్రైవేట్ భాగాలపై తన్నాడు..

Asha saini
సినీ నటి ఆషాశైనీ లైంగిక వేధింపులకు గురైంది. ప్రముఖ నిర్మాత తనను మోసగించాడని.. 14 నెలల పాటు లైంగికంగా వేధించాడని.. తన ప్రైవేట్ భాగాలపై తన్నుతూ దారుణంగా హింసకు గురిచేశాడని ఆషాసైనీ వాపోయింది. ఈ మేరకు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. 
 
అంతేగాకుండా వీడియోను నెట్టింట పోస్టు చేసింది. అందులో తాను ఎంత నరక వేదనను అనుభవించిందో.. ఆ బాధకు కారణం ఏంటో తెలిపింది. తన ఫోన్ లాక్కున్నాడని.. ఎవరితోనూ మాట్లాడనివ్వలేదని.. సినిమాలకు దూరంగా పెట్టాడని ఆషా శైనీ తెలిపింది. 
 
ఆ నరకం నుంచి తాను పారిపోయి బయటకు వచ్చానని.. ఆ నరకం నుంచి చిత్ర హింసల నుంచి కోలుకునేందుకు కొన్ని నెలలు పట్టిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సంతోషంగా తల్లిదండ్రుల వద్ద వున్నానని చెప్పుకొచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ లక్స్ పాప సాంగ్ తనకి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో కనిపించింది.