Folk dancer Madhuri.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఏమైంది?
Madhuri Rathod
మాధురి రాథోడ్ ఆత్మహత్య లేఖ రాసి, ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను ఒక తప్పు చేశానని, దానికి శిక్షే తన మరణమని మాధురి ఆ లేఖలో పేర్కొంది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినప్పటికీ అతన్ని అరెస్టు చేయకపోవడంతో మాధురి తీవ్ర ఆవేదనకు గురైంది. తన పరువు పోయిందని, ఈ తప్పు వల్ల తనకు చాలా చెడ్డ పేరు వచ్చిందని మాధురి వాపోయింది.
ఇక బతికే ఆశ లేదని భావించిన మాధురి, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన కుటుంబ సభ్యులు, ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురిని కాపాడారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

