గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జులై 2020 (18:51 IST)

ఎవరు తొలుత ప్రపోజ్ చేశారంటే.. ఇప్పటికీ కన్ఫ్యూజనే? (video)

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, సినీ నటి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు నమ్రత సమాధానాలు చెప్పింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కథల విషయంలో నమ్రతదే పైచేయి అనే టాక్‌కు ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసింది. సినిమా కథల సెలెక్షన్స్ విషయంలో పూర్తి నిర్ణయం మహేష్ బాబుదే అని ఒక్క మాటతో చెక్ పెట్టింది. ఇక తనకు ఇష్టమైన హీరో కూడా మహేష్ బాబు అని తెలియజేసింది. 
 
పనిలో పనిగా మహేష్ బాబుతో తన లవ్ స్టోరీ గురించి కూడా నమ్రత మొదటిసారి బయటపెట్టింది. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో మొదటిసారి మహేష్ బాబుతో నమ్రత కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా జ్ఞాపకాలు తను ఎప్పటికి మరచిపోలేనని చెప్పిన నమ్రత మొదట న్యూజిలాండ్‌లో జరిగిన షూటింగ్ ద్వారానే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని వెల్లడించింది. 
 
ఇక ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అనే విషయంపై కూడా నమ్రత స్పందించింది. అన్ని విషయాలు తనకు గుర్తు ఉన్నప్పటికీ ఆ ఒక్క విషయంలో మాత్రం తనకి కాస్త కన్ఫ్యూజన్ ఉందని వివరణ ఇచ్చింది. ఇక భవిష్యత్తులో మరోసారి మహేష్ బాబుతో నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. బహుశా అది జరగకపోవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఒక నెటీజన్ ఆమె టాటూ గురించి ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉందని అడగగా.. చేయిపై వేసుకున్న టాటూని చూపించారు. అందులో మహేష్ బాబు పేరుతో పాటు గౌతమ్, సితారా పేర్లు కూడా ఉన్నాయి.