మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (13:07 IST)

గమ్మత్తు అయిన సినిమా టైటిల్‌

Gammathu logo
`కేరింత`ఫేం పార్వతీశం, `బిగ్ బాస్` ఫేం స్వాతి దీక్షిత్ న‌టిస్తున్న చిత్రానికి `గ‌మ్మ‌త్తు` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా టైటిల్ లోగోను ప్రముఖ నిర్మాత శ్రీ బెక్కెం వేణు గోపాల్ ఆవిష్క‌రించారు. సూపర్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై అంకిత శ్రీనివాస‌రావు, బుయ్యాని మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు అశ్వని శ్రీ కృష్ణ.
 
ఈ చిత్ర షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నది. పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ఈ చిత్ర యూనిట్ సబ్యులు తెలిపారు. ఈ చిత్ర యూనిట్ కి లక్కీ మీడియా అధినేత ప్రముఖ నిర్మాత శ్రీ బెక్కం వేణు గోపాల్ గారు ఈ టైటిల్ లోగో ఆవిష్కరించిన సందర్బంగా వాళ్ళందర్నీ కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేసి మంచి విజయం సాధించాలని ఆశీర్వదించారు. 
 
ఈ చిత్ర యూనిట్‌ మాట్లాడుతూ, మా మొదటి చిత్రాన్నిసెంటిమెంట్ గా లక్కీ మీడియా అధినేత బెక్కెo వేణు గోపాల్ ఆవిష్కరించడం చాలా లక్కీగా ఉందని మాకు ఎంతో కలిసి వస్తుందని భావిస్తున్నాం అన్నారు. ఇందులో జబర్దస్త్ ఫేం రాకెట్ రాఘవ, వకీల్ సాబ్ సూపర్ వుమెన్ లిరీష న‌టించారు. వసంత్ సంగీత దర్శకత్వం వ‌హించ‌గా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ లక్ష్మీకాంత్ కనికే, ఎడిటర్ శ్రీకాంత్ పట్నాయక్, ప్రణవ్ స్వరూప్ ఎగ్సిగ్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు.