శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (13:14 IST)

సాయిపల్లవితో ప్రేమాయణం లేదు.. మంత్రి గంటా శ్రీనివాసరావు

ఫిదా భామ సాయిపల్లవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు, నటుడు రవితేజ ప్రేమాయణం నడుపుతున్నట్లు సోషల్ మీడియోలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై మంత్రి గంటా స్పందించారు. తన కుమారుడికి ఇప్పటికే

ఫిదా భామ సాయిపల్లవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు, నటుడు రవితేజ ప్రేమాయణం నడుపుతున్నట్లు సోషల్ మీడియోలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై మంత్రి గంటా స్పందించారు. తన కుమారుడికి ఇప్పటికే వివాహం అయ్యిందని.. సాయిపల్లవితో ప్రేమాయణం వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేశారు. 
 
సాయిపల్లవికి, రవితేజకు మధ్య ఎలాంటి ప్రేమ లేదని గంటా స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదని, కానీ ఇద్దరు యువతీ యువకుల జీవితాలపై మచ్చ పడేలా వార్తలు రావడంతోనే ఖండిస్తున్నట్లు మంత్రి వివరణ ఇచ్చారు. 
 
''జయదేవ్'' చిత్రంతో గంటా కుమారుడు రవితేజ హీరోగా అరంగేట్రం చేసిన నేపథ్యంలో.. తన కుమారుడితో సాయిపల్లవిని లింక్ చేస్తున్న వార్తలను ఆపాలని మంత్రి అన్నారు. అవాస్తవాలను రాయొద్దని విజ్ఞప్తి చేశారు.