శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (17:56 IST)

గట్టిగా హగ్ చేసుకో..ఫరియా అబ్దుల్లా

Santhosh Shobhan, Faria Abdullah
Santhosh Shobhan, Faria Abdullah
సంతోష్ శోభన్‌ను ఫరియా అబ్దుల్లా గట్టిగా హగ్ చేసుకో అంటూ చెప్పిన చిలిపి సంఘటన ఈరోజే జరిగింది. ఇరువురు లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనే సినిమాలో నటించారు. ప్రమోషన్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో సినిమా గురించి, మారేడుమల్లి అడవిలో షూటింగ్ గురించి చెపుతూ అక్కడ పడ్డ కష్టాలను వివరిస్తున్నాడు సంతోష్.
 
సరికొత్తగా ఉండాలని మాదాపూర్లోని ఏఎంబి మళ్లకు వెళ్లి కొత్తాగా అక్కడి జనాలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇతను మీకు తెలుసా అంటూ కామెడీగా సుదర్శన్ అడగటంతో అందరూ సంతోష్ ఎవరో చెప్పలేకపోయారు. అంతలో ఫరియా వచ్చింది. నాగురించి కూడా బాగా చెప్పండి అన్నారు. ఆమెను అందరూ గుర్తుపట్టారు.
 
ఫరియా గొప్ప నటి.. జాతిరత్నాలు లాంటి సినిమా చేసి మెప్పించింది. ఆమెతో ఈ సినిమా చేయడం అదృష్టం అని సంతోష్ చెప్పగానే, ఒక్కసారిగా హగ్ చేసుకుంది. దాంతో ఇంకా గట్టిగా హగ్ చేసుకో అంటూ.. సరదాగా గట్టిగా ఇద్దరూ ఇలా హగ్ చేసుకున్నారు. ఇక ఈసినిమాలో లిప్ లాక్ కూడా చేసుకున్నారు.