1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (18:24 IST)

థియేటర్ బోసిపోయింది, కానీ రివ్యూ రేటింగ్ అదిరింది

theater
theater
మధ్య టాలీవుడ్లో  సినిమాలకు థియేటర్ కు జనాలు పెద్దగా రావడం లేదు. పెద్ద సినిమాలు లేవు. ఆ సినిమాలన్నీ క్రిస్మస్, సంక్రాంతికి ఎదురుచూస్తున్నాయి. ఇటీవలే జిన్నా తో పాటు నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. కానీ మొదటి షోకే జనాలు లేదు. హైద్రాబాద్లో మల్టీప్లెక్స్ అయితే బోసిపోయింది. కరోనా టైములో ఎంత ఖాళీగా ఉందొ ఆలా ఉంది. ఇక మామూలు థియేటర్ లో విడుదలయిన సినిమాలు రద్దు చేసారు.
 
కానీ రద్దయిన ఓ సినిమా రేటింగ్ మాత్రం కొన్ని సోషమీడియాలో మూడున్నర రేటింగ్ ఇస్తూ ఆ సినిమా ఓ పోస్టర్ వేసి పుబ్లి సిటీ చేసుకుంది. ఇది ఇండస్ట్రీలో హాస్యాస్పదంగా మారింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు సినిమా బాగోగుపోయినా అదుర్స్ అంటూ ఫేక్ న్యూస్ ఇస్తూ పరిశ్రమను, జనాలను మాయ చేస్టున్నారనే విమర్శా బలంగా వినిపిస్తుంది. దానితో అసలు బాగున్నా సినిమాను ప్రమోట్ చేయాలనుకున్న ఆయా నిర్మాతలు, దర్శకులు, హీరోలు భయపడాల్సివస్తుంది. ఈ విషయంపై ఛాంబర్ దృష్టి పెట్టాలని కొందరు నిర్మాతలు కోరారు. కానీ ఇది తమ పరిధి కాదని చెప్పడంతో రూల్స్ మార్చి ఏదైనా చేయకపోతే పస ఉన్న సినిమాలు నాశనం అవుతాయని అంటున్నారు.
 
ఈ నెలలో మొదటి వారంలో  అరడజనుకు పైగా చిన్న సినిమాలొస్తున్నాయి. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ ఊర్వశివో రాక్షశివో,  లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రొమోషన్ భాగంగా ఏ ఎం.బి.కు వెళ్లి అక్కడి వారిని లైక్ షేర్ సబ్ స్క్రైబ్ హీరో సంతోష్ శోభన్, సినిమా పేరు గురించి అడిగితే చాలా మంది తెలియదు. అన్నారు. కొందరు ఇతన్ని ఎక్కడో చూశామని చెప్పారు. కరోనా తర్వాత ఎవరి లైఫ్ వారిది లాగ మారడం, వినోదం ఇంట్లో ఉండటంతో థియేటర్కు జనాలు రావడం లేదు. పేరున్న హీరో, దర్శకుడు సినిమాలకే జనాలు థియేటర్ కు వస్తున్నారని ఐమాక్ ప్రతినిధి తెలియచేస్తున్నారు.