గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (17:23 IST)

వినాయ‌క నిమ‌జ్జనం నాడే జిన్నా టీజ‌ర్‌

Manchu Vishnu, Payal Rajput, Sunny Leone
Manchu Vishnu, Payal Rajput, Sunny Leone
హైద‌రాబాద్‌లో వినాయ‌క నిమ‌జ్జనం రోజు రోడ్లన్నీ బంద్‌ అయిపోయాయి. అయితే అదేరోజు సినిమాలు విడుద‌లవుతున్న ఒకేఒక‌జీవితం, కెప్టెన్ చిత్రాల‌తోపాటు మ‌రో రెండు అనువాద చిత్రాలు వున్నాయి. కానీ ఆరోజు క‌లెక్ష‌న్ల‌ప‌రంగా థియ‌ట‌ర్ల‌కు పెద్ద‌గా రాక‌పోవ‌చ్చ‌ని ఎగ్జిబిట‌ర్లు భావిస్తున్నారు. ఇదిలా వుండ‌గా, మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జిన్నా. ఈ మూవీని యువ దర్శకుడు సూర్య డైరెక్ట్ చేస్తుండగా, AVA ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. 
 
కాగా, ఈ సినిమా  ఫస్ట్ లుక్ టీజర్ సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. మాదాపూర్‌లోని ఎఎంబి.మాల్‌లో ఉద‌యం 10గంట‌ల‌కు విడుద‌ల‌చేసేందుకు ముహూర్తం పెట్టారు. ఇందులో వెస్ట్ర‌న్ గాళ్ళ‌గా స‌న్నీ లియోన్ న‌టిస్తుండ‌గా, విలేజ్ అమ్మాయిగా పాయ‌ల్ న‌టిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందించగా జి నాగేశ్వరరెడ్డి కథని, కోన వెంకట్ స్క్రీన్ ప్లే ని అందించారు.