గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (19:48 IST)

తెలుగులో లవ్ స్టోరీ చేయాలనుంది : గౌరి జి కిష‌న్

Gauri G Kishan
Gauri G Kishan
శోభ‌న్‌బాబుగా సంతోష్ శోభ‌న్‌.. శ్రీదేవిగా గౌరి జి కిష‌న్ న‌టించిన చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు. బుధవారం రాత్రి ప్రీరిలీజ్ వేడుక జరిగింది. గౌరి జి కిష‌న్ మాట్లాడుతూ, తమిళ్ సినిమా 96 లో విడుదల అయ్యాక ఆఫర్స్ వచ్చాయి. జాను సినిమలో కూడా నటించాను. నా నటన చూసి ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల అవకాశం ఇచ్చారు. నిర్మాతలు సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నాకు ఆఫర్ ఇవ్వడం చాలా సంతోషంగాఉంది.
 
ఈ సినిమాలో నా పాత్ర సంతోష్ శోభ‌న్ తో టామ్ అండ్ జెర్రీ గా ఉంటుంది. నాగబాబు గారి కూతురుగా నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్ ప్ర‌శాంత్ చాలా కూల్ గా కథ చెప్పారు. బాగా చేశాను అన్నారు. నాకు తెలుగులో లవ్ స్టోరీ చేయాలనిఉంది అని చెప్పారు. అది విన్న వెన్న వెంటనే డైరెక్టర్ ప్ర‌శాంత్ తప్పకుండా అంటూ ఇండికేషన్ ఇచ్చారు.