స్కేటింగ్ చేసిన జెనీలియా.. చెయ్యి విరిగిందట... ఓ మై గాడ్! (video)

Genelia
Genelia
సెల్వి| Last Updated: గురువారం, 11 మార్చి 2021 (12:02 IST)
బొమ్మరిల్లు బామ్మ జెనీలియా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జెనీలియా.. బాలీవుడ్ టాప్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై జెనీలియా నటనకు దూరంగా వుంది. ఈ నేపథ్యంలో తన పిల్లల కోసం స్కేటింగ్‌లో కంపెనీ ఇవ్వడం కోసం ప్రయత్నించిన జెనీలియా చేయి విరిగింది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్కేటింగ్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయాలనే ఉద్దేశంతో వీడియో తీస్తూ.. ప్రమాదవశాత్తూ జెనీలియా కిందపడింది. ఈ ఘటన చేయి ఎముక విరిగింది. చేయి విరగడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలో నయం అవుతుందని.. జెన్నీ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


దీనిపై మరింత చదవండి :