ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (11:01 IST)

దేవుడు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాం.. హ్యాపీ బర్త్ డే అంజూ.. ప్రేమతో జై..

తెలుగు హీరోయిన్ అంజలి మధ్య అనుబంధం ప్రత్యేకమైంది. జర్నీ సినిమాతో అలరించిన కోలీవుడ్ హీరో జై, హీరోయిన్ అంజలి మధ్య అనుబంధం ప్రత్యేకమైంది. వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి.

తెలుగు హీరోయిన్ అంజలి మధ్య అనుబంధం ప్రత్యేకమైంది. జర్నీ సినిమాతో అలరించిన కోలీవుడ్ హీరో జై, హీరోయిన్ అంజలి మధ్య అనుబంధం ప్రత్యేకమైంది. వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. అయితే జై పుట్టిన రోజు సందర్భంగా అంజలి షూటింగ్ స్పాట్‌కు వెళ్లి సర్‌ప్రైజింగ్ పార్టీ ఇవ్వడం.. ఆ రోజంతా వారిద్దరూ కలిసి వుండటం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 
 
తాజాగా అంజలి పుట్టిన రోజును పురస్కరించుకుని జై సోషల్ మీడియా వేదికగా అంజలిపై ప్రేమను కురిపించాడు. ''నువ్వంటే నాకు ఎంత ప్రత్యేకం.. నీ పుట్టిన రోజన్నా అంతే ప్రత్యేకం. దేవుడు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాం. హ్యాపీ బర్త్ డే అంజూ.. ప్రేమతో జై.." అంటూ స్వయంగా లేఖ రాశాడు. 
 
దీనికి అంజలి ''నాతో ఉన్నందుకు థ్యాంక్స్‌ జై''. నువ్వెప్పుడూ ఉంటావని ఆశిస్తున్నా.. ప్రత్యేకమైన రోజు ప్రత్యేకమైన లేఖ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ అతని లేఖను రీట్వీట్ చేసింది. దీంతో వీరిద్దరి ప్రేమ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.