శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (13:45 IST)

శ్రీముఖి అందాలకు డైలాగులు తోడైతే.... గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ (వీడియో)

యాంకర్ కమ్ యాక్టర్‌గా మారిన శ్రీముఖి.. తాజాగా "గుడ్ బ్యాడ్ అగ్లీ'' అనే సినిమాలో నటిస్తోంది. యాంకర్‌గానే కాకుండా యాక్టర్‌గానూ మంచి పేరు కొట్టేయాలని శ్రీముఖి ఉవ్విళ్లూరుతోంది. శ్రీముఖి, కిషోర్ కుమార్, హ

యాంకర్ కమ్ యాక్టర్‌గా మారిన శ్రీముఖి.. తాజాగా "గుడ్ బ్యాడ్ అగ్లీ'' అనే సినిమాలో నటిస్తోంది. యాంకర్‌గానే కాకుండా యాక్టర్‌గానూ మంచి పేరు కొట్టేయాలని శ్రీముఖి ఉవ్విళ్లూరుతోంది. శ్రీముఖి, కిషోర్ కుమార్, హర్షవర్ధన్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నాలుగు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్‌లో శ్రీముఖి అందంతో పాటు.. డైలాగులు ఆకట్టుకునేలా వున్నాయి. 
 
ఈ చిత్రాన్ని అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బొగాడి అంజిరెడ్డి నిర్మిస్తున్నారు. హర్షవర్థన్‌ ఈ చిత్రానికి రచన, సంగీతం కూడా అందిస్తున్నారు. బలవంతులు, బలహీనతలు అనే రెండు కులాలు ఉన్న ఈ లోకంలో.. సాగే డైలాగులు భలే అనిపించాయి. వీడిదో పువ్వు, ఆమెదో నవ్వు, వీళ్లదో లవ్వు అనే సెటైరికల్ డైలాగ్స్ బాగున్నాయి. ఈ ట్రైలర్‌లో శ్రీముఖి అందంతో పాటు డైలాగ్స్ అదిరిపోయేలా నిలిచాయి. ఈ ట్రైలర్‌ను ఓ లుక్కేయండి..