బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (11:52 IST)

ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే కదా.. సినిమాల్లోనూ అందుకే?: ఆండ్రియా

ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే.. సినిమాల్లోనూ అదే చూపిస్తున్నాం. ప్రతి ఇంట్లో జరిగేదే తెరపై చూపిస్తున్నాం.. అని సినీ ఆండ్రియా వెల్లడించింది. సినిమాలో లిప్ కిస్ సీన్ అద్భుతంగా పండాలంటే.. ముద్దులు ప

ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే.. సినిమాల్లోనూ అదే చూపిస్తున్నాం. ప్రతి ఇంట్లో జరిగేదే తెరపై చూపిస్తున్నాం.. అని  సినీ ఆండ్రియా వెల్లడించింది. సినిమాలో లిప్ కిస్ సీన్ అద్భుతంగా పండాలంటే.. ముద్దులు పెట్టాల్సిందేనని ఆండ్రియా వెల్లడించింది. తాజాగా గృహం సినిమాలో సిద్దార్థ్‌తో కలిసి నటించిన ఆండ్రియా.. హాట్ హాట్ ముద్దులు సినిమాల్లో అవసరమా అనే ప్రశ్నకు బదులిచ్చింది. 
 
సన్నివేశాలు సహజంగా రావాలంటే ముద్దులు పెట్టాల్సిందే అంటోంది. ఇంట్లో నాలుగు గోడల మధ్య ముద్దులు పెట్టుకోవడం సహజం.. వెండితెరపై సీన్ పండాలంటే.. లిప్ కిస్‌లు తప్పనిసరి.. తాము కేవలం నటిస్తామని, సన్నివేశాన్ని పండించడానికి తప్పట్లేదని వెల్లడించింది.

ట్రైలర్లోనే ఓ ముద్దు సన్నివేశం కాకుండా.. గృహంలో మరో మూడు సీన్లు వున్నాయని ఆండ్రియా చెప్పుకొచ్చింది. ఇకపోతే.. సిద్దార్థ్-ఆండ్రియా లిప్ కిస్సులకు మంచి స్పందన వస్తోంది. గృహం సినిమా నవంబర్ మూడో తేదీన రిలీజ్ కానుంది.