మహేష్ బాబును రొమాంటిక్ గా కిస్ చేసిన శ్రీలీల
మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా గుంటూరు కారం. శ్రీలీల నాయిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా గురించి ఒక్కో అప్ డేట్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలో సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఫిలిం సిటీలో కొద్దిరోజుల పాటు షూటింగ్ జరిగింది. లేటెస్ట్ గా మహేష్ బాబు, శ్రీలీల పై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. ఇందులో ఇద్దరూ జీవించేశారని చిత్ర యూనిట్ చెబుతుంది.
మహేష్ బాబు సినిమాలో ఆయన అందాల్ని పొగుడుతూ హీరోయిన్ ఆట పట్టించే సన్నివేశాలు వుంటాయి. ఇందులో కూడా ఆ తరహాలో దర్శకుడు సరికొత్తగా క్రియేట్ చేశాడు. అందులో భాగంగా రొమాంటిక్ సాంగ్ లో శ్రీలీల మహేష్ ను గట్టిగా కిస్ చేసిందట. దాంతో ఈ షాట్ బాగుందని అనడంతో వెంటనే ఆ ఫొటోను ఈరోజు విడుదల చేశారు. ఇటీవలే ఫస్ట్ సాంగ్ ధమ్ మసాలా పాట విడుదలైంది. ఇది రెండో సాంగ్. ఈ పాట ప్రోమో 11వ తేదీ సాయంత్రం 04:05 గంటలకు, పూర్తి పాట డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్. ఈ సినిమాను నిర్మిస్తోంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.