సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (17:16 IST)

శ్రీలీల అంటే భయపడ్డ నితిన్

Nitin - sreleela
Nitin - sreleela
కథానాయకుడు నితిన్ తన మనసులోని మాటను తెలిపాడు. లేటెస్ట్ గా ఆయన నటించిన సినిమా ఎక్స్ ట్రార్డినరీ మేన్. వక్కంతం వంశీ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురిని అనుకున్నారు. దర్శకుడు మాట మేరకు శ్రీలీలను తీసుకున్నారు. ముందుగా ఆమె పేరు చెబితే కాస్త భయం ప్రకటిస్తూ అమ్మో ఆమె వద్దండి అన్నాడట నితిన్.
 
ఎందుకంటే ఆమెతో డాన్స్ చేసే సన్నివేశాలున్నాయి. పైగా ఇప్పుడు ఆమె ట్రెండ్ నడుస్తుంది. అందుకే కమిట్ అయి డాన్స్  బాగా చేయాలని శిక్షణ తీసుకుని మరీ చేశాడు. ఓలే ఓలే పాపాయి .. సాంగ్ లో ఆమెతోపాటు చాలా స్పీడ్ గా చేయాల్సి వచ్చింది. ఈ విషయమై నితిన్ మాట్లాడుతూ, ఆ సాంగ్ లో నేను కూడా ఆమెతో బాగా చేయాల్సి వచ్చింది. తను చాలా స్పీడ్ గా స్టెప్ లు వేస్తుంది. నాకేమో 40 దాకా వచ్చాయి. ఆమె 25 దాటిన యువతి. ఆమె స్పీడ్ కంటే ధీటుగా వుండాలని డాన్స్ చేశాను. ఇప్పుడు ఆ పాటకు మంచి అప్లాజ్ వచ్చింది అని అన్నాడు. డిసెంబర్ 8 న సినిమా విడుదల కాబోతుంది.