గురువారం, 28 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (14:17 IST)

నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఎలా వుందో తెలుసా- రివ్యూ

nitin- sreeleela
nitin- sreeleela
నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర నరేష్, హైపర్ ఆది ఇతరులు
 
సాంకేతికత- సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్, సంగీతం: హారిస్ జయరాజ్, దర్శకుడు : వక్కంతం వంశీ, నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డ
 
కథ 
 
అభి (నితిన్) సినిమా హీరో కావాలనేది డ్రీమ్. అందుకే జూనియర్ ఆర్టిస్ట్ వుంటూ బ్యాంక్ బెంచ్ స్టూడెంట్ లా నిలబడాల్సి వస్తుంది. ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా వున్న ఆయన లైఫ్ లో  లిఖిత (శ్రీలీల) ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. అదే టైంలో అభికి హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి, సైతాన్ పాత్రలో ఇన్ వాల్వ్ అవుతాడు. అసలు సైతాన్ లా ఎందుకు మారాడు ?, ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) పాత్ర ఏమిటి ?,అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
సమీక్ష-
సినిమారంగంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ తిప్పలు ఇందులో బాగా చూపించారు. నితిన్ ఈాసారి ఎంటర్ టైన్ మెంట్ ఎంచుకుని మార్కులు పొందాలని చూశాడు. ఆ కోవలో అక్కడక్కడా వినోదం పండించాడు. తన బాడీ లాంగ్వేజ్ తో యాక్షన్ సీక్వెన్స్ స్ లో  బాగా నే నటించాడు. డాన్స్ కూడా బాగా కష్టపడినట్లు కనిపించింది.
 
ఇందులో ప్రత్యేకమైన పాత్రలో నటించిన డా. రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. చేసిన కొద్దిసేపయినా రాజశేఖర్ ఆకటుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్ తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్ – రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లు అలరించాయి.
 
ఇతర నటీనటులు సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీలు వారి పాత్రలకు సూటయ్యారు. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. దర్శకుడు గత సినిమాల లాగే ఈ సినిమాలోనూ పాయింట్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే  కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్ తో సాగితే బాగుండేది. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్ లో సరిగా లేదు. ముఖ్యంగా హీరో హైలైట్ కోసం విలన్ ఎత్తుగడలు సిల్లీగా అనిపిస్తాయి. 
 
ఇక హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. ఫస్ట్ హాఫ్ నిజంగానే ఫన్ తో సాగింది. ఆ ఫన్ ను కూడా దర్శకుడు సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. హారిస్ జయరాజ్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అక్కడక్కడా లాజిక్ లు మిస్ కావడంతోపాటు ఎమోషన్ సరిగా పండించలేదు. ఇది ఒక వర్గం ప్రేక్షకులను అలరిస్తుంది.
రేటింగ్ : 2.5/5