రాజస్థాన్‌కు డేరా బాబా ఆయుధాలు, నగదు.. రాఖీ సావంత్‌కు గుర్మీత్ సింగ్ మంచి ఫ్రెండట..!
డేరా బాబా ఆశ్రమంలో జరిగిన తనిఖీలు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని.. ఇప్పటికే ఆశ్రమంలోని ఆయుధాలు, నగదు తరలించబడినాయని డేరా బాబా సాక్షిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.
డేరా బాబా ఆశ్రమంలో జరిగిన తనిఖీలు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని.. ఇప్పటికే ఆశ్రమంలోని ఆయుధాలు, నగదు తరలించబడినాయని డేరా బాబా సాక్షిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.
డేరా బాబా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 28 నుంచి ఆగస్టు 31లోపే ఆయుధాలు, నగదు తరలించబడ్డాయని, ఇవన్నీ రాజస్థాన్‌కు వెళ్ళిపోయివుంటాయని సాక్షిగా వుండే ఓ వ్యక్తి వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే, డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడటం ద్వారా రూ.200కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట. గుర్మీత్ బాబాపై ఆరోపణలు రావడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు కలిగిన డేరా బాబాపై అత్యాచార ఆరోపణలను నిర్ధారిస్తూ న్యాయమూర్తి ప్రకటించగానే, ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. విధ్వంసానికి దిగారు. ఈ ఆందోళనల్లో 32 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ క్రమంలో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇలా రూ.200 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తిని డేరా బాబా అనుచరులు ధ్వంసం చేసారు. ఇదిలా ఉంటే.. డేరా బాబాపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత అధికమవుతున్న వేళ ప్రముఖ శృంగార నటి రాఖీ సావంత్ అతనికి మద్దతు పలికింది.
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ తనకు మంచి స్నేహితుడని వెల్లడించింది. బాబాకు శిక్ష పడటం తనను ఎంతో బాధించిందని, గణేష్ మహరాజ్ దయవల్ల కేసు నుంచి ఆయనకు విముక్తి కలగాలని కోరుకుంది. గుర్మీత్ సింగ్‌కు విముక్తి కలిగితే... తనకు ఒక మంచి సినిమా అవకాశం లభిస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా డేరాబాబాతో రాఖీ సెల్ఫీ నెట్టింట వైరల్ అవుతోంది.