సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (07:09 IST)

బాడీ పెయిన్స్.. హనీని పంపిస్తే మసాజ్ చేయించుకుంటా: డేరా బాబా

డేరా బాబ్ అలియాస్ గర్మీత్ రాం రహీం సింగ్. డేరా సచ్చా సౌధా చీఫ్. బాబా ముసుగులో ఎన్నో అక్రమాలు, దారుణాలకు పాల్పడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు.

డేరా బాబ్ అలియాస్ గర్మీత్ రాం రహీం సింగ్. డేరా సచ్చా సౌధా చీఫ్. బాబా ముసుగులో ఎన్నో అక్రమాలు, దారుణాలకు పాల్పడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు. 
 
సొంత సామ్రాజ్యం, సకల సౌఖ్యాలు, ‘పితా గుఫా’ పేరుతో ఖరీదైన పడకలపై రాసక్రీడలు. ఇలా ఒకటేమిటి... ఎన్నో దారుణాలకు పాల్పడిన గుర్మీత్ సింగ్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. 
 
మసాజ్ చేసేందుకు తన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను జైలులో ఉంచాలన్న కోరిక తీర్చేందుకు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించకపోవడంతో... గుర్మీత్ సింగ్‌కు పిచ్చెక్కి పోతోందట. దీంతో గుర్మీత్ సింగ్ జైలు గోడలతో మాట్లాడుకుంటున్నాడట. 
 
తొలి రెండు రోజులు కన్నీరు మున్నీరైన గుర్మీత్ సింగ్ ఇప్పుడు జైలు గోడలతో మాట్లాడుకుని సేదదీరుతున్నాడు. జైలు గదిలో దోమల బాధతో 88 అడుగుల గదిలో మూల నక్కాడు.