మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 17 ఆగస్టు 2017 (12:56 IST)

'Half Girlfriend'కి అంత సీనుందా? 'సాహో' సంగతులు(వీడియో)

బాహుబలి చిత్రం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ప్రభాస్ చిత్రం సాహో. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరా అని జల్లెడ వేసుకుని వెతికినా ఎవ్వరూ ప్రభాస్ స్టామినాను తట్టుకుని నిలబడే స్టార్ దొరకలేదట. అనూహ్యంగా 'Half Girlfriend' చిత్రంలో తన అందచందాలతో కు

బాహుబలి చిత్రం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ప్రభాస్ చిత్రం సాహో. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరా అని జల్లెడ వేసుకుని వెతికినా ఎవ్వరూ ప్రభాస్ స్టామినాను తట్టుకుని నిలబడే స్టార్ దొరకలేదట. అనూహ్యంగా 'Half Girlfriend' చిత్రంలో తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసిన శ్రద్ధా కపూర్ సూపర్బ్‌గా సెట్ అయిపోయిందట.
 
ఆమెను ఏ కోణంలో నుంచి చూసినా ప్రభాస్ స్టామినాకు తగ్గట్లుగా వున్నదనీ, అందువల్ల ఆమెను హీరోయిన్ గా బుక్ చేసినట్లు చిత్ర యూనిట్ చెపుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ప్రభాస్ సరసన అనుష్క అనుకున్నారు కానీ... ఎందుకో ఆమెను పక్కన పెట్టేశారు. మార్కెట్ దృష్ట్యా కాబోలు.. శ్రద్ధా కపూర్ అయితే ఓకే అనుకున్నట్లున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళంలో నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే.