శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (11:19 IST)

''రాడికల్'' కోసం అందాల ఆరబోతకు రెడీ అయిన హెబ్బా పటేల్

'కుమారి 21 ఎఫ్‌', 24 కిస్సెస్ వంటి సినిమాల్లో నటించి సంచలనం సృష్టించిన హెబ్బా పటేల్ ప్రస్తుతం మళ్లీ వార్తల్లో నిలిచింది. రొమాంటిక్ లన్ స్టోరీలు చేస్తూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ ముద్దుగుమ్మ... మరోసారి అందాలను ఆరబోసేందుకు సై అంటోంది. 
 
సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా ''రాడికల్'' అనే ఒక సినిమా సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమాలో కథానాయికగా హెబ్బా పటేల్‌ను ఎంపిక చేసుకున్నారు. రొమాంటిక్ సీన్స్ పుష్కలంగా వున్న ఈ పాత్ర, తన క్రేజ్‌ను మరింత పెంచుతుందని హెబ్బా పటేల్ భావిస్తోందట. 
 
ఈ సినిమాలో హెబ్బా పటేల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో హెబ్బా పటేల్ బోల్డ్‌గా కనిపిస్తుందని టాక్ వస్తోంది.