సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (19:44 IST)

శాసనసభలో హెబ్బాపటేల్ ప్రత్యేకపాట

Hebbapatel'
Hebbapatel'
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అందాలతార హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది. 
 
ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర బృందం ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ ప్రత్యేకపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రవిబసుర్ సంగీత ఈ చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. 
 
ఈ ప్రత్యేకపాటను ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రత్యేకపాటను ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతులు అందించగా, పాపులర్ సింగర్  మంగ్లీ ఆలపించారు. ముఖ్యంగా ఈ పాట మాస్‌ను ఉర్రూతలూగిస్తుంది.త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి.