శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (13:49 IST)

పొట్టి డ్రస్సుతో చెర్రీ తోటలో పూజా హెగ్డే.. ఫోటో వైరల్ (video)

Pooja Hegde
Pooja Hegde
పూజా హెగ్డే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరుస సినిమాలతో నిత్యం ఎంతో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే వీకెండ్ మాత్రం అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తుంది. 
 
ఇలా వీకెండ్ సమయంలో ఈమె తన ఆర్గానిక్ ఫామ్‌లో పెంచుతున్నటువంటి పండ్ల తోటలో విహరిస్తూ పెద్ద ఎత్తున సందడి చేసింది. 
 
పొట్టి డ్రస్సు ధరించి చెర్రీ తోటలో పండ్లను తెంపుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలోనే ఎంతో స్టైలిష్ లుక్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉన్నటువంటి ఈ ఫోటోలను పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
పూజా హెగ్డే పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇష్టపడటంతో తానే స్వయంగా ఆర్గానిక్ ఫార్మ్ ద్వారా ఎన్నో రకాల పండ్లను పండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె వీకెండ్ సందర్భంగా చెర్రీ తోటలో సందడి చేశారు. 
 
చెట్ల నుంచి చెర్రీలను తెంపుతూ ఫోటోలను షేర్ చేసిన ఈమె ఈ పండ్లు మీకోసమే అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలను మరో నటి అనుపమ పరమేశ్వరన్ లైక్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
ఇక పూజ హెగ్డే సినిమాల విషయానికొస్తే.. పూజ నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పటికీ ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో జనగణమన, మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలోని నటిస్తున్నారు.