లిఫ్టులో ఇరుకున్న బన్నీ - బోయపాటి... ఎలా బయటపడ్డారు?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్‌లో రిలీజై ఘనవిజయం సాధించిన చిత్రం ''సరైనోడు''. ఈ చిత్రం అనుకున్న దానికంటే ఘన విజయం సాధించడంతో మాంచి ఊపు మీదున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా బన్నీ, బోయపాటి శుక్రవారం ఉదయం సింహాచలం అప్పన్నని దర్శించుకున్నారు. ఆ తర్వాత దేవస్థానం కేటాయించిన గదిలో నుంచి కిందకి రావడానికి లిఫ్ట్ ఎక్కగా సాంకేతిక లోపంతో మధ్యలోనే ఆగిపోయింది.
దీంతో కంగారుపడ్డ ఆలయ అధికారులు తీవ్రగా శ్రమించి చివరకు లిఫ్ట్ తలుపులు బద్దలుకొట్టి మరీ బన్నీని, బోయపాటిని బయటకి లాగారు. లిఫ్ట్‌లో జరిగిన సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలిపారు. మొత్తానికి బన్నీ మాత్రం ఏ ప్రమాదం లేకుండా సురక్షితంగా బయట పడ్డాడు. దీంతో ఇరువురు సురక్షితంగా బయటపడినందుకు మరోసారి దేవుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారట.